Header Banner

తెలుగు రాష్ట్రాల్లో థియేటర్‌లకు తాళాలు! కొత్త ఒత్తిడిలో నిర్మాతలు!

  Sun May 18, 2025 19:03        Others

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని సినిమా ఎగ్జిబిటర్లు సంచలన నిర్ణయం తీసుకున్నారు. జూన్ 1వ తేదీ నుంచి థియేటర్లను నిరవధికంగా మూసివేయాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. ప్రస్తుతమున్న అద్దె (రెంటల్) పద్ధతిలో థియేటర్లను నడపడం తమకు సాధ్యం కావడం లేదని, కేవలం సినిమా వసూళ్లలో వాటా (పర్సంటేజీ) పద్ధతిని అమలు చేస్తేనే థియేటర్లను కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు.
ఈ రోజు (ఆదివారం) హైదరాబాద్‌లోని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ కార్యాలయంలో తెలుగు రాష్ట్రాల ఎగ్జిబిటర్ల ప్రతినిధులు సమావేశమయ్యారు. ఈ సమావేశానికి ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, డి. సురేష్ బాబు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎగ్జిబిటర్లు తమ సమస్యలను, ఆర్థిక ఇబ్బందులను నిర్మాతలకు వివరించినట్లు సమాచారం. థియేటర్ల నిర్వహణ ఖర్చులు పెరిగిపోయాయని, అద్దె పద్ధతి వల్ల తాము తీవ్రంగా నష్టపోతున్నామని ఎగ్జిబిటర్లు ఆవేదన వ్యక్తం చేశారు. "అద్దె ప్రాతిపదికన థియేటర్లను ఇకపై నడిపించలేం. మాకు పర్సంటేజీ రూపంలోనే వాటా కావాలి. అప్పుడే మాకు గిట్టుబాటు అవుతుంది," అని వారు తేల్చిచెప్పినట్లు తెలిసింది.

ఈ మేరకు తమ డిమాండ్లను, నిర్ణయాన్ని వివరిస్తూ నిర్మాతలకు అధికారికంగా ఒక లేఖ రాయాలని కూడా ఈ సమావేశంలో నిర్ణయించారు. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే, జూన్ 1 నుంచి విడుదల కావాల్సిన పలు సినిమాలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. ముఖ్యంగా చిన్న, మధ్య తరహా చిత్రాల విడుదలకు ఇబ్బందులు తలెత్తవచ్చని పరిశ్రమ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఎగ్జిబిటర్ల నిర్ణయంతో తెలుగు సినిమా పరిశ్రమలో కొత్త చర్చ మొదలైంది. ఈ సమస్యకు నిర్మాతలు, ఎగ్జిబిటర్లు కలిసి ఎలాంటి పరిష్కారం కనుగొంటారో చూడాలి.

ఇది కూడా చదవండి: ఏపీలో పేదలకు పండగే.. ఈ పథకం కింద ఒక్కొక్కరికి రూ.2.50లక్షలు! దరఖాస్తు చేసుకోండి! 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన మంత్రి, మేయర్ విజయలక్ష్మి.. సౌకర్యాలపై ఆరా!

 

ముంబైలో హై అలెర్ట్.. విమానాశ్రయం, తాజ్ హోటల్‌కు బాంబు బెదిరింపులు..

 

ఎన్నారైలకు షాక్! యూఎస్ నుంచి సొమ్ము పంపితే అదనపు భారం!

 

వైసీపీకి దిమ్మతిరిగే షాక్.. వల్లభనేని వంశీపై మరో కేసు! ఇక పర్మినెంట్ గా జైల్లోనేనా.?

 

ఈ-పాస్‌పోర్ట్ వచ్చేసింది! విదేశాంగ శాఖ కీలక నిర్ణయం!

 

లోకేశ్ తాజాగా కీల‌క సూచ‌న‌లు.. అందరూ అలా చేయండి! అమ్మ లాంటి పార్టీని మరచిపోవద్దు!

 

ఏపీలో రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసిన వారికి గుడ్‌న్యూస్..! ఒక్క క్లిక్‌తో స్టేటస్ చెక్ చేస్కోండిలా..!

 

మెగా డీఎస్సీ గడువు పొడగింపుపై మంత్రి లోకేష్‌ కీలక వ్యాఖ్యలు..! అభ్యర్థులకు ఊహించని..!

 

22 కార్పొరేషన్లకు నామినేటెడ్ పోస్టులు ప్రకటించిన ప్రభుత్వం! ఏపీ ఎన్నార్టీ కి ఆయనే! స్కిల్ డెవలప్మెంట్ ఎవరికంటే!

 

పండగలాంటి వార్త.. విజయవాడవిశాఖ మెట్రో రైలు ప్రాజెక్టులకు విదేశీ బ్యాంక్​ రుణాలు! ఆ రూట్ లోనే ఫిక్స్..

 

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. అతి తక్కువ ధరకే ఫైబర్ నెట్.. ఆ వివరాలు మీకోసం!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #TeluguCinema #TheatreShutdown #FilmIndustryCrisis #TollywoodNews #MovieReleasesAtRisk #ProducersVsExhibitors